schedule Thursday, May 21, 2026

ముజాహిద్‌పూర్ ఆదర్శ పాఠశాలలో సైన్స్ ల్యాబ్, సమ్మర్ క్యాంపు ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి

calendar_today May 11, 2026
person Prajagalam News
ముజాహిద్‌పూర్ ఆదర్శ పాఠశాలలో సైన్స్ ల్యాబ్, సమ్మర్ క్యాంపు ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
(ప్రజాగళం,కుల్కచర్ల)   సైన్స్ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృక్పథం పెంపొందుతుందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ గ్రామంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో భాగంగా హైస్కూల్‌లో రూ.13.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్, సమ్మర్ క్యాంప్‌ను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.సమ్మర్ క్యాంప్‌ల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుందన్నారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రేణుక దేవి,స్థానిక సర్పంచ్ చంద్రభూపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు,ఎంపిడిఓ రామకృష్ణ నాయక్,ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,గ్రామస్థులు పాల్గొన్నారు.