విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులుగా గంజిపల్లి నారాయణ
calendar_today
May 21, 2026
person
Prajagalam News
( తాండూర్)
విశ్వహిందూ పరిషత్ నూతన పట్టణ అధ్యక్షులుగా గంజిపల్లి నారాయణ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజా గళం ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం మరియు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం విశ్వహిందూ పరిషత్ లక్ష్యం అని అన్నారు. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని అన్నారు. సనాతన ధర్మం ఒక్క కులానికి చెందినది కాదని సనాతనం ధర్మం అంటే శాశ్వతమని అర్థం అన్నారు. సూర్యుడు,చంద్రుడు, పంచభూతాలు ఎంత శాశ్వతమో సనాతన ధర్మం కూడా అంత శాశ్వతం అని పేర్కొన్నారు. ఇది ఒక మతం కాదు శాశ్వతమైన ధర్మం అని అన్నారు. సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలు నాడు మూఢనమ్మకాలు అన్నవారు నేడు వైజ్ఞానిక ఆధారాలతో ఉన్నాయని ఇప్పుడు తెలుసుకుంటున్నారని అన్నారు. హిందూ దేవాలయాల నిర్మాణం సంరక్షణ, గోరక్షణ, మత మార్పిడులను అరికట్టేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. సనాతన ధర్మంలో మాత్రమే సమానత్వం ఉందని ప్రతి ఒక్క హిందువు ఏకమై మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.హిందూ సమాజ సేవ, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.