schedule Thursday, May 21, 2026

దాడికి పాల్పడిన మాజీ కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి....కాంగ్రెస్ నాయకులు అఖిల్ బాబా

calendar_today May 19, 2026
person Prajagalam News
దాడికి పాల్పడిన మాజీ కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి....కాంగ్రెస్ నాయకులు అఖిల్ బాబా
  ( తాండూర్) అకారణంగా తమ కుటుంబ పై దాడికి పాల్పడిన ప్రస్తుత 5వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ సాజిద్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అఖిల్ బాబా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో  మాట్లాడుతూ  సయ్యద్ సాజిద్ తోపాటు అతని సోదరులు  తమ కుటుంబ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి తాను అందిస్తున్న సేవలను ఓర్వలేక మాజీ కౌన్సిలర్ సాజీద్ తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సజీద్ చేతిలొ ఓడిపోయినప్పటికీ, సాజీద్  గెలుపు సంతోషం లేదన్నారు.ఎన్నికల్లో ఓడిపోయినా తాము నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నామని, ప్రజల్లో తమకు ఉన్న మంచి పేరు, ఆదరణను చూసి ఓర్వలేకే సాజీద్ తమ ఇంటిపై దాడికి వచ్చారని ఆరోపించారు. తాము ఇంట్లో లేని సమయం చూసి, కౌన్సిలర్ సజీద్ తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ, దాడికి దిగారని పేర్కొన్నారు. ప్రజలు గెలిపించింది వార్డును అభివృద్ధి చేయడానికే గానీ, ఇలా దౌర్జన్యాలు చేయడానికి కాదని హితవు పలికారు. లేనిపోని కారణాలతో ఇళ్లపై దాడులు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కౌన్సిలర్ సాజీద్ పై తాండూరు పట్టణ పోలీసులు తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.