schedule Thursday, May 21, 2026

మున్సిపల్ లో చెత్త సేకరణ ప్రైవేటీకరణ తగదు

calendar_today May 20, 2026
person Prajagalam News
మున్సిపల్ లో చెత్త సేకరణ ప్రైవేటీకరణ తగదు
 

ప్రైవేట్ ఆటోలను వెంటనే రద్దు చేయాలి... సిఐటియు డిమాండ్

( తాండూర్) మున్సిపల్ లో చెత్త సేకరణ ప్రైవేటీకరణ తగదని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ లో చెత్త సేకరణ కోసం ప్రైవేటీకరణ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించారు.ప్రైవేటు ఆటోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు జీవో 60 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేశారు. బుధవారంం పట్టణంలో మున్సిపల్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు తాండూర్ మున్సిపల్ వర్కర్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా శ్రీనివాస్ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా రాములు వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ కార్యదర్శిగా డి వెంకట్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ లో చెత్త సేకరణ కోసం ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకించారు..ప్రైవేటు ఆటోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని ప్రతి నెల ఒకటో తేదీ కార్మికులందరికీ జీతాలు చెల్లించాలని అన్నారు.చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులలో వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఒకరికి తీసుకోవాలని కొంతమందికి పెండింగ్ జీతాలు చెల్లించాలి ఈఎస్ఐపీఎఫ్ లో ఉన్నటువంటి కార్మికుల పేర్లని సవరించాలని రెగ్యులర్ జవాన్లని నియమించాలని అన్నారు. కార్మికులకు పనిభారాన్ని తగ్గించాలని ఏండ్ల తరబడిగా అట్టడుగు కులాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు తాండూర్ మున్సిపాలిటీలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పట్టణాన్ని శుభ్రం చేస్తున్నారని సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాల్లో అనేక ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నదని పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు ఇవ్వకపోవడంతో వస్తున్న వేతనాలు కూడా రెగ్యులర్ గా రాకపోగా కార్మికుల కుటుంబాల్లో అనేక ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. దీనితో పాటు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికారులు మున్సిపల్ కాంటాక్ట్ కార్మికులకు రెగ్యులర్ గా వేతనాలు చెల్లించేలా సౌకర్యాలు కల్పించాలని కోరారు. చట్టపరమైన సౌకర్యాలు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం బలరాం, నర్సిములు, అయిబ్ ప్రకాష్, ఆశప్ప డి లక్ష్మణ్, జి నర్సిములు,బి వీరేశం కే శంకర్, జయ శివకుమార్, ఎన్ వెంకటప్ప, ఎం పవన్, మహేష్ ఏం చిన్న, డి శ్రీనివాస్ఎ,న్ రాములు డి శంకర్ తదితరులు పాల్గొన్నారు.