కుల గణన నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ హర్షణీయం
calendar_today
May 21, 2026
person
Prajagalam News
* బీసీ ఉద్యమాలకు సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త ఊపు
*కుల గణనతోనే బీసీలకు సంపూర్ణ న్యాయం
*బీసీల అసలైన జనాభా లెక్కలు బయటపడే సమయం ఆసన్నమైంది
*కుల గణన వ్యతిరేకులకు ఇది చెంపపెట్టు
.... జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
(తాండూర్)
దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు & తాండూర్ బీసీ సంఘము కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలకు కొత్త ఊపు తీసుకువచ్చిందని ఆయన అన్నారు.ఇప్పటి వరకు బీసీల అసలైన జనాభా లెక్కలు బయటకు రాకపోవడం వల్ల విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల విషయంలో బీసీలు అనేక అన్యాయాలకు గురయ్యారని తెలిపారు. కుల గణనతోనే బీసీలకు సంపూర్ణ న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశంలో బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం అత్యంత అవసరమని అన్నారు. కుల గణన ద్వారా వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తేనే ప్రభుత్వాలు బీసీలకు తగిన విధానాలు, అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.కుల గణన వ్యతిరేకులకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం సాధించే దిశగా సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. జనగణనలో సమగ్ర కుల గణన తప్పనిసరిగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. బీసీల అసలైన జనాభా లెక్కలు బయటపడే సమయం ఆసన్నమైందని, రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరిగే దిశగా ఇది కీలక అడుగని పేర్కొన్నారు.