schedule Thursday, May 21, 2026

వరి ధాన్యం తూకంలో అవకతవకలు ఉండొద్దు,కఠిన చర్యలు తప్పవు పిఎసిఎస్ వైస్ చైర్మన్

calendar_today May 21, 2026
person Prajagalam News
వరి ధాన్యం తూకంలో అవకతవకలు ఉండొద్దు,కఠిన చర్యలు తప్పవు పిఎసిఎస్ వైస్ చైర్మన్
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో దామర్ చెడ్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూకాలు వేయాలని తూకంలో ఎలాంటి అవకతవకలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని,ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపడుతుంది.రైతులకు సకాలంలో గన్ని బ్యాగులను అందించాలని,తూకం చేసిన వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు పంపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు శంకరప్ప,మాజీ ఎంపిటిసి రాజేందర్ రెడ్డి,సీసీలు అంబయ్య,తదితరులు పాల్గొన్నారు.