ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి :- పరామర్శించిన సర్పంచ్ వార్వల్ల.అంజిలయ్య,బిజేపి జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్
May 20, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన కుల్కచర్ల మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది.కుల్కచర్ల మండల కేంద్రంలోని బోరబండ ప్రాంతంలో ఉపాధి కూలీలు నీటి కాలువ పనులు చేస్తుండగా తేనెటీగలు అకస్మాత్తుగా వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. గాయపడ్డ కూలీలకు కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ చికిత్స అందిస్తున్నారు. స్థానిక సర్పంచ్ వార్వల అంజిలయ్య, బిజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్, ఉప సర్పంచ్ విజయ్, గుడాల రమేష్ తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి పండ్లను పంపిణీ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుడు కిరణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.