శాంతిభద్ర పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ... డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య
May 20, 2026
Prajagalam News
( తాండూర్) శాంతి భద్రతల పరిరక్షణ కోసమే రాజీవ్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించినట్లు తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య అన్నారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, తాండూర్ డిఎస్‌పి ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం తెల్లవారుజామున 04:00 గంటల నుండి ఉదయం 07:00 గంటల వరకు ముమ్మరంగా “కమ్యూనిటీ కాంటాక్ట్ ” కార్యక్రమం నిర్వహించారు. కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు, అక్కడ నివసిస్తున్న ప్రజలందరి ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే కాలనీలో గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, 6 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీ లో ఉంటున్న ఇద్దరు రౌడీ షీటర్స్ లను ఇద్దరు సస్పెక్ట్స్ లను తనిఖీ చేశారు . అనుమానస్పదంగా కనిపించిన వారిని మొబైల్ చెక్ డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్ తీసుకోని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి ఎన్. యాదయ్య కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ప్రజల రక్షణ, భద్రత కోసమే ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. “పోలీసులు మరియు ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించడం ద్వారానే సమాజంలో నేరాలను పూర్తిగా అరికట్టగలుగుతామని ప్రతి కాలనీ వాసి తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కాలనీ వాసులకు సైబర్ నేరాల పట్ల, మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల పూర్తి అవగాహన కల్పించారు. కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా, గంజాయి అమ్మకాలు లేదా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిఎస్‌పి ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ తనిఖీల్లో పట్టణ సీఐ పరమేష్, రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి,దారూర్ ఇన్స్పెక్టర్ రఘు రాములుతో పాటు ఎనిమిది మంది ఎస్‌ఐలు, 54 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు పాల్గొన్నారు.
