బిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి రోజు ప్రారంభం
May 10, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో గోసై కాలనీలో ఆదివారం నాడు బిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, వికారాబాద్ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు జానకి టాస్ వేసి క్రికెట్ ఆటను ప్రారంభించారు.మొదటి మ్యాచ్ వైస్ ఛాంపియన్ జంగం వీరయ్య,అర్జున్ టీం లకు టాస్ వేయగా వైస్ ఛాంపియన్ జంగం వీరయ్య టాస్ గెలిచి ఫీల్డింగ్ను ఎంచుకున్నారు.వీరిద్దరిలో జంగం వీరయ్య అల్లాపూర్ (బి) గ్రామ సర్పంచ్ మ్యాచ్ గెలవడం జరిగింది. బిపిఎల్ టోర్నమెంట్ క్రికెట్ కు స్పాన్సర్ లు శ్రీను,శివ,రాములు, బస్వ రాజ్ సహకరించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను సర్పంచ్ జనం వీరయ్య దక్కించుకున్నారని అన్నారు.అదేవిధంగా పది టీములు ఆటోలో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ఫైనల్ విన్నర్ కు మనీ ప్రైస్ 45 వేల రూపాయలు,రన్నర్ కు 25 వేల రూపాయలు మనీ ప్రైస్ తో పాటు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆటగాళ్లు,అనూప్ ప్రసాద్,వార్డు మెంబర్ శ్రీకాంత్,తదితరులు, పాల్గొన్నారు.