రాజ్ పుత్రులు మహారాణా ప్రతాప్ ను ఆదర్శంగా తీసుకోవాలి
May 9, 2026
Prajagalam News
*రాజ్ పుత్ సమాజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి...బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
* రాజ్ పుత్ సమాజ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ
*ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు
(తాండూర్)
తాండూరు పట్టణంలో రాజ్ పుత్ సమాజం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖాంజాపూర్ సమీపంలో గల మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి పట్టణంలోని కాళికాదేవి ఆలయం, వినాయక్ చౌక్ పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్ మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మహారాణా ప్రతాప్ చిత్రపటాన్ని ఊరేగించారు. జై జై రాణా.. జై మహారాణా నినాదాలతో పట్టణం మారుమోగింది.అనంతరం భద్రేశ్వర్ చౌక్ లో జయంతి వేడుకల సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజపుత్రులు మహారాణా ప్రతాప్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. మహారాణా ప్రతాప్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని అన్నారు. అదేవిధంగా జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారిగా నిర్వహించాలని అన్నారు.మాతృభూమి విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన వీర యోధుడు అని కొనియాడారు. రాజ్ పుత్ సమాజం వారు కోరిన విధంగా వారి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో మాట్లాడి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ ఉత్సవ సమితిలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని మహనీయుల జీవిత చరిత్ర ఘటన పుస్తకాలను అందజేస్తానని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,బీసీ కమిషనర్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, సుభాన్ రెడ్డి సార్, పర్యాద రామకృష్ణ లు మాట్లాడుతూ 600 ఏండ్ల క్రితం భారతదేశంలో జరిగిన దండ యాత్రల్లో శత్రువులను చీల్చి చెండాడిన ధీరుల గురించి ప్రతీ ఇంట్లో తెలుసుకోవాలని సూచించారు. రాణీ జైవంత బాయి కూడా తన కొడుకు రాణా ప్రతాప్ ను హిందువుల ఆత్మగౌరవం నిలిపేలా శత్రువులను ఎదుర్కొనేలా తీర్చిదిద్దారని కొనియాడారు. మహారాణా ప్రతాప్ ఆనాడు హల్ది ఘాట్ యుద్ధంలో మొగులులను గడగడలాడించారని ఆయన యుద్ద నీతిని తదనంతరం తరాలు పాటించాలని కొనియాడారు. తొలి స్వాతంత్ర సమరయోధుడు మొగుళ్ళతో పోరాడిన హిందూ ధర్మ రక్షకుడు, హిందూ శౌర్యానికి ప్రతీక మేవాడ్ మహావీరుడు మహారాణా ప్రతాప్ అని కీర్తించారు. మహారాణ ప్రతాప్ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసేలా వారి కీర్తిని నలు దిశలా చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజపూర్ సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, బాలకృష్ణారెడ్డి, జుంటుపల్లి వెంకట్, బిజెపి కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి,అంతారం కిరణ్, స్థానిక కౌన్సిలర్ మహేశ్వరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగు, యువ నాయకులు రాజు గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, సమాజ గౌరవ అధ్యక్షులు ఠాకూర్ సుభాష్ సింగ్, సమాజ అధ్యక్షులు దిలీప్ సింగ్ ఠాకూర్, జనరల్ సెక్రటరీ శివానంద్ సింగ్ , ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ ఠాకూర్ రమేష్ సింగ్, వైస్ చైర్మన్ ఠాకూర్ ఉమేష్ సింగ్, సంఘం మాజీ అధ్యక్షులు ఠాకూర్ సూరజ్ సింగ్, దినేష్ సింగ్, క్యాషియర్ పోలీస్ ప్రతాప్ సింగ్,యువ దళ్ కన్వీనర్ దీపక్ సింగ్ ఠాకూర్, ఠాకూర్ శివాజీ సింగ్, సభ్యులు ప్రభాకర్ సింగ్, నర్సింగ్ సింగ్, నర్సింగ్ సింగ్, బాలాజీ సింగ్ ఠాకూర్,కమల్ అవస్థి,మురళి సింగ్ ఠాకూర్, లకన్ సింగ్ ఠాకూర్, శరత్ సింగ్ ఠాకూర్, రాజేష్ సింగ్ ఠాకూర్, రోహిత్ సింగ్, రాజపుత్ మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలు అనిత ఠాకూర్, ప్రధాన కార్యదర్శి సురేఖ ఠాకూర్, పద్మిని ఠాకూర్,కవిత ఠాకూర్, సుమన్ ఠాకూర్, పల్లవి ఠాకూర్,ఝాన్సీ ఠాకూర్, శిరీష ఠాకూర్, తారా ఠాకూర్, జ్యోతి ఠాకూర్, జ్యోతి ఠాకూర్ (గంజిపల్లి )నీత ఠాకూర్, అంబికా ఠాకూర్, అనిత ఠాకూర్ మున్ని ఠాకూర్, స్వాతి ఠాకూర్, ప్రియాంక ఠాకూర్ చోటీ ఠాకూర్, వికారాబాద్ జిల్లా గంజిపల్లి గ్రామ సమాజ సభ్యులు, ఎర్రన్ పల్లి సమాజ సభ్యులు, దౌల్తాబాద్ గ్రామ సమాజ సభ్యులు, బిచ్చాల్, కొడంగల్, అనంతపూర్, కర్ణాటక లింగంపల్లి గ్రామ సమాజ సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.