schedule Thursday, May 21, 2026

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి :- కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్

calendar_today May 9, 2026
person Prajagalam News
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి :- కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్
(ప్రజాగళం,కుల్కచర్ల) కుల్కచర్ల మండలంలో బస్సులు, మార్కెట్లు, జాతరలు వంటి రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ దొంగతనాలు పెరుగుతున్నాయని,వీటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ప్రజలు రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. దొంగలు ఫోన్ దొంగిలించిన వెంటనే సిమ్ కార్డులను వేరే ఫోన్లలో ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా బాధితుల ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని వెల్లడించారు. ఇటీవల కుసుమసముద్రం గ్రామానికి చెందిన వడ్డె రాములు మొబైల్ ఫోన్ దొంగిలించబడగా, అతని ఖాతా నుంచి రూ.38వేలు దొంగలు బదిలీ చేశారు. బాధితుడు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో రూ.20వేలు మొత్తాన్ని నిలుపుదల చేయడం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రాంతాల్లో ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవడం, బలమైన లాక్‌లు పెట్టుకోవడం, గోప్యంగా ఉంచడం, ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేసి బ్యాంక్ సేవలను నిలిపివేయడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.