ప్రాచీన కళలను,కళాకారులను ప్రోత్సహిస్తాం.. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి
calendar_today
May 9, 2026
person
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
ప్రాచీన కళలను, కళాకారులను ప్రోత్సహిస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ శ్రీ భక్త సిరియాల వీధి నాటకానికి రూ.5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ కళలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. భక్తి పరమైన వీధి నాటకాలు సమాజానికి మంచి సందేశాలను అందిస్తాయని, యువత ఈ విధమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆనందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామచంద్రయ్య, స్థానిక వార్డు సభ్యుడు జెల్ల నర్సింలు, నాటక బృంద సభ్యులు పాల్గొన్నారు.