10న మోదీ సభను విజయవంతం చేయాలి. బిజెపి కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ముదిరాజ్
May 8, 2026
Prajagalam News
(కుల్కచర్ల)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ 10వ తేదీన మోదీ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభలో పాల్గొనాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను గుర్తించి, అభివృద్ధికి మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ ఇచ్చే సందేశాన్ని వినేందుకు ప్రతి ఒక్కరూ హాజరై సభను విజయవంతం చేయాలని గుడాల వెంకటేష్ పిలుపునిచ్చారు.