schedule Thursday, May 21, 2026

చెరువు తూముల మరమత్తుకు ప్రత్యేక కృషి :- కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today May 8, 2026
person Prajagalam News
చెరువు తూముల మరమత్తుకు ప్రత్యేక కృషి :- కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
(కుల్కచర్ల) తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో పరిగి నియోజకవర్గంలోని చెరువుల తూముల లీకేజీలు,శిథిలావస్థలో ఉన్న తూములను గుర్తించి వాటిని బాగు చేయడంపై పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలోని అక్కమ్మ చెరువు, నడిమి చెరువు, దామర్లకుంట, బసిరెడ్డి కుంట కు సంబంధించిన తూములు, కట్టల మరమత్తుల కోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తూములు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల నీరు వృథా అవుతోందని ఇటువంటి ప్రాంతాల్లో కొత్త తూముల మరమత్తు కోసం సర్వేలు చేపడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, పంచాయతీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.