schedule Wednesday, September 02, 2026

మహారాణా ప్రతాప్ జయంతిని విజయవంతం చేయండి

calendar_today May 7, 2026
person Prajagalam News
మహారాణా ప్రతాప్ జయంతిని విజయవంతం చేయండి
తాండూర్) ఈనెల 9న తాండూర్ నిర్వహించే శ్రీ మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని రాజ్పూర్ సంఘ ప్రతినిధులు , వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు హిందూ బంధువులను కోరారు. పట్టణంలోని ఆర్య సమాజ్ లో జరిగిన కుల సంఘాల సమావేశంలో 9వ తేదీ శనివారం జరిగే హిందూ ధర్మ రక్షక్ సంకల్పయాత్ర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు శ్రీకాంత్ రెడ్డి, జుంటుపల్లి వెంకట్, ప్రతినిధులు మర్యాద రామకృష్ణ, నాయకులు రాజు రాజ్ పుత్ సంఘం అధ్యక్షులు దిలీప్ సింగ్ ఠాకూర్ లు మాట్లాడుతూ తొలి స్వాతంత్ర సమరయోధుడు మొగులలతో పోరాడిన హిందూ ధర్మ సంరక్షకుడు, హిందూ శౌర్యానికి ప్రతీక, మేవాడ్ వీరుడు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఖాజాపూర్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల మహారాణా ప్రతాప్ విగ్రహం నుండి కాళికాదేవి మందిరం వరకు మందిరం నుండి వినాయక్ చౌక్, కూరగాయల బజార్, గాంధీ చౌక్ మీదుగా భద్రేశ్వర్ చౌక్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని అనంతరం భద్రేశ్వర్ చౌక్ లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాజపుత్ సంఘ గౌరవ అధ్యక్షులు సుభాష్ సింగ్, ఉపాధ్యక్షులు ఠాకూర్ ఉమేష్ సింగ్, పూర్వ అధ్యక్షులు ఠాకూర్ రమేష్ సింగ్, సంఘ ప్రతినిధులు ఠాకూర్ కరణ్ సింగ్, శివాజీ సింగ్, వివిధ సంఘాల ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు.