schedule Wednesday, September 02, 2026

దళారులను నమ్మి మోసపోవద్దు... ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

calendar_today May 6, 2026
person Prajagalam News
దళారులను నమ్మి మోసపోవద్దు... ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
(తాండూరు) దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో, అగ్గనూర్ గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వరి ధాన్యం' కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. దొడ్డు రకం క్వింటాల్ కు రూ.2,389/- సన్నాలకు రూ.500/- బోనస్ తో మద్దతు ధర అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.