schedule Thursday, May 21, 2026

బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కమల వికాసం ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక-వికారాబాద్ జిల్లా బిజేపి కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు

calendar_today May 4, 2026
person Prajagalam News
బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కమల వికాసం ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక-వికారాబాద్ జిల్లా బిజేపి కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు
ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ కుల్కచర్ల మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్య అతిథిగా బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నేడు మేము గర్వంతో తల ఎత్తుకుంటున్నాము. పశ్చిమ బెంగాల్‌ రాజకీయ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేస్తూ, బెంగాల్ ప్రజలు బీజేపీకి సంపూర్ణ మెజారిటీతో అఖండ విజయాన్ని అందించారు. ఇది కేవలం ఒక పార్టీ విజయం కాదు, ఇది బెంగాల్ సంస్కృతి, అస్తిత్వం మరియు అభివృద్ధి కాంక్ష సాధించిన విజయమన్నారు. అస్సాం రాష్ట్ర రాజకీయ చరిత్రలో నేడు ఒక నూతన శకం ఆరంభమైంది. భారతీయ జనతా పార్టీ అలుపెరగని కృషికి, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారి దక్షతకు నిదర్శనంగా అస్సాం ప్రజలు మాకు వరుసగా మూడవసారి (Hat-trick) అధికారాన్ని అప్పగించారు. 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 100 మార్కును చేరుకుని అఖండ మెజారిటీ సాధించడం మా కార్యకర్తలందరికీ గర్వకారణం. దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో NDA (బీజేపీ - AINRC) కూటమి అఖండ విజయం సాధించడం పట్ల మా కార్యకర్తలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుదుచ్చేరి ప్రజలు కుటుంబ పాలనను, అవినీతిని తిరస్కరించి, నరేంద్ర మోదీ గారి అభివృద్ధి మంత్రాన్ని నమ్మారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కాటన్ పల్లి అంజిలయ్య, స్థానిక సర్పంచ్ అంజీలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ మోనా చారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ గారు మండల ప్రధాన కార్యదర్శి లు హనుమంతు, పేరమళ్ళ వెంకటేష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ బైకడి వెంకటేష్, వెంకటేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్, మండల ఉపాధ్యక్షులు రాజ్ కుమార్,కొండ అంజయ్య రామచంద్రయ్య, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, ఎంపీటీసీ ఎన్నికల కన్వీనర్ గాదె మల్లేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బెందూరి ఆంజనేయులు, రామకృష్ణ రాంపూర్ భూత అధ్యక్షులు లక్ష్మయ్య, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, సుంకు మల్లేష్, రాజేశ్వర్, బాలకృష్ణారెడ్డి, పాశం నరసింహా రెడ్డి, చిన్నోజీ, హరికృష్ణ, శంకర్ భారతీయ జనతా పార్టీ వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.