schedule Thursday, May 21, 2026

ఎమ్మెల్యే టిఆర్ఆర్ ను కలిసిన కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్

calendar_today May 4, 2026
person Prajagalam News
ఎమ్మెల్యే టిఆర్ఆర్ ను కలిసిన కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్
(కుల్కచర్ల)   పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో నూతనంగా నియమితులైన కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమింపబడ్డ గోపాల్ నాయక్ కు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ప్రజా సేవలో ముందుండి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీరంపల్లి సర్పంచ్ గడ్డం వెంకటయ్య, ఇప్పాయిపల్లి సర్పంచ్ పోటీ మల్లేష్, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య, కామన్ పల్లి సర్పంచ్ సత్తెమ్మ వెంకటేష్, ఘనపూర్ సర్పంచ్ రవీందర్ నాయకులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.