ప్రకృతి వ్యవసాయం చేయండి లేదంటే భూమి నిస్సారం
May 4, 2026
Prajagalam News
యూరియాని తగ్గించి భూమాతను
రక్షించండి
ప్రాణహిత చేవెళ్ల వస్తేనే రంగారెడ్డికి ఊరట
కేంద్రం రాష్ట్రంపై కవిత తల్లి ప్రేమ చూపిస్తుంది
... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
(

తాండూర్)
రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని
లేదంటే భూమి నిస్సారమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమం లో మంత్రి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య లతో కలిసి పాల్గొన్నారు.సోమవారం తాండూర్ ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాలు నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ రోజు నుండి మే 9 వరకు రైతు వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ గీతం తో పాటు జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ప్రయత్నం చేయక పొతే భవిష్యత్తు లో భూమి మొత్తం నిస్థార మవుతుందని అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మక్కువ చూపాలని అన్నారు.తక్కువ పెట్టుబడి తో ఎక్కువ పంటలు పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగు పై రైతులు ద్రుష్టి పెట్టాలన్నారు. భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.సైంటిస్ట్ లు భూమిని ఏ రకంగా సంరక్షించు కోవాలో అవగాహన కలిపిస్తారని తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయుటకు ఒక లక్షా 40 వేల కోట్లు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చొరవతో కోటిపల్లి ప్రాజెక్టుకు 90 కోట్ల నిధులు మంజూరయ్యాయని దీంతో పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. చేవెళ్ల ప్రణహిత ప్రాజెక్టుతో రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అని అన్నారు. ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి కె అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంపై సవితి తల్లి ప్రేమను చూపిస్తుందని మనం పన్నులు చెల్లిస్తే తిరిగి ఇవ్వకుండా బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇస్తుందని ఆరోపించారు. మనం పండించిన పంటలు కొనకుండా అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. ఆర్థిక భారం ఉన్న తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్నలను కొనుగోలు చేసిందని చెప్పారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేయాలని ప్రతిపక్షాలు రైతులతో రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. యూరియాను తయారు చేసేది కేంద్ర ప్రభుత్వం ఉందని రాష్ట్రానికి ఇవ్వకుండా సమస్యను సృష్టించిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పామాయిల్ పంటలను వేయడంలో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని పదివేల ఎకరాలకు పామాయిల్ని పండిస్తే త్వరలోనే వికారాబాద్ జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని అన్నారు. ప్రతి పంటలో పామాయిల్ ను వేయాలని రైతులకు కోరారు.
రైతులు ఒకే పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని దీనికి సంబంధించిన యాంత్రికరణ పనిముట్లను సబ్సిడీ ద్వారా అందిస్తామని అన్నారు.భారత దేశంలో అత్యధిక పంటలు పండించే రైతులు తెలంగాణ రైతు లేనని, ప్రభుత్వం ఎక్కువ మొత్తం లో వరి కొనుగోలు చేస్తుందని అన్నారు.నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పై అవగాహన కలిపించుకోవాలన్నారు.ప్రకృతి పంటలు పండించిన లావణ్య రెడ్డి తో కలిసి టి జి ఆన్లైన్ యాప్ ను ప్రారంభించారు.వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, మత్స్య శాఖ వివిధ శాఖ లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజు,రైతు దేశానికి వెన్నెముక వంటి వాడు, వ్యవసాయం దండగ కాదు,, వ్యవసాయం ఒక పండుగ, మంత్రి చొరవ తో వ్యవసాయ రంగాన్నే ముందుకు తీసుకెళ్తున్నమ్మన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే అభివృద్ధి జరగాలనే ఉద్దేశం తో రైతులు ప్రకృతి పంటల సాగు పై దృష్టి పెట్టాలన్నారు.ఎ ఓ లు, సైంటిస్ట్ ల సూచనలు పాటించి పొలాల్లో ఏయే పంటలు వేస్తే బాగుంటుందని వాటి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.14 వేల కోట్లు మార్కెట్ కోసం మంజూరు అయ్యాయని అయిల్ ఫామ్ కంపెనీ జిల్లా కు మంజూరు ఐనదని, తాండూర్ కంది పప్పుకు చాలా ప్రాముఖ్యత ఉందని, కంది బోర్డు ఏర్పాటు చేయాలనీ ఈ సందర్బంగా మంత్రిని కోరారు.జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక లో భాగంగాఈరోజు నుండి మే 9 వరకు రైతు వారోస్తావాలు ప్రారంభం, రైతులకు సంబందించి రైతు భరోసా, రైతు భీమా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరించడం, వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం రైతులు, పలువురు సైంటిస్ట్ లు మాట్లాడారు.ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత, మార్కెట్ చైర్మన్ లు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి,ఎ ఎం సి చైర్మన్ లు, ఆత్మ చైర్మన్ లు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రజా ప్రతి నిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.