కార్మికుల సంక్షేమానికి, భద్రతకు ప్రజా ప్రభుత్వం కృష
May 1, 2026
Prajagalam News
( తాండూర్)
కార్మికుల సంక్షేమానికి భద్రతకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా ఐఎన్టీయూసీ తాండూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ ఐ ఎన్ టి వి సి ఏర్పాటు చేసిన మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం వారి యొక్క భద్రత కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు కార్మికుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ లు మాట్లాడుతూ కార్మికులందరీ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్టీసీ కార్మికుల సమస్యలను రెండు రోజుల్లోనే ప్రజా ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు జిలాని న్యాయవాది మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ముఖ్యంగా లేబర్ కార్డు లో సభ్యులుగా ఉన్నవారికి ఇద్దరు కూతుర్ల వివాహానికి 30 వేల రూపాయలు, సహజ మరణం పొందిన కార్మికునికి రెండు లక్షల రూపాయలు ప్రమాదవశాత్తూ కార్మికుడు చనిపోతే 10 లక్షల రూపాయలు కార్మికులకు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సంక్షేమల పథకాలు కార్మికులకు అందాలంటే సభ్యునిగా గుుర్తింపు పొందాలని అన్నారు. అదేవిధంగా కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేయాలని జిల్లా అధ్యక్షులను కోరారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు అనిల్ కుమార్ బషీరాబాద్ పార్టీ అధ్యక్షులు నర్సింలు గౌడ్, ఇన్చార్జిలు దొరశెట్టి సత్యమూర్తి, సాయప్ప, మాజీ కౌన్సిలర్ లు వెంకన్న గౌడ్,బోయ రవిరజ్ తదితరులు పాల్గొన్నారు.