కార్మిక సంక్షేమంలో ఆర్బీఓఎల్ ముందంజ... జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
calendar_today
May 1, 2026
person
Prajagalam News
కార్మిక సంక్షేమమే లక్ష్యంగా ముందుకు.. ఎండి సరళ శ్రీనివాస్ రెడ్డి
కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ యజమాన్య అవార్డు
( తాండూర్)
కార్మిక సంక్షేమంలో ఆర్ బి ఓ ఎల్ యజమాన్యం ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. మేడే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్తమ యాజమాన్య అవార్డు కార్మికుల సంక్షేమంలో ఎల్లప్పుడూ ముందుండే ఆర్బీఓఎల్ సంస్థకు లభించింది.కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వారి సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న రాడికల్ బయో ఆర్గానిక్ లిమిటెడ్ (ఆర్బీఓఎల్) సంస్థకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ యాజమాన్యాలకు అందించే ప్రతిష్టాత్మక అవార్డు ఈసారి ఆర్బీఓఎల్ సంస్థ కు లబించింది. మేడే పురస్కారాల కార్యక్రమంలో ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి ఈ అవార్డును జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ... కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూ వారి మౌలిక వసతుల సదుపాల సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆర్ బి ఓ ఎల్ సంస్థ ఇతర సంస్థలకు ఆదర్శమని అవార్డు రావడం పై శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. అనంతరం ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి కార్మికులే మూలకారకం అని వారి అభివృద్ధి సంక్షేమమే మా బాధ్యత అని అన్నారు.ఈ అవార్డును సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో అదికారులు, కార్మిక నాయకులు ఆర్బీఓఎల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.