schedule Thursday, September 03, 2026

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

calendar_today April 24, 2026
person Prajagalam News
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

• అగ్రి డ్రోన్ల ద్వారా వేగవంతమైన, సురక్షితమైన పిచికారీ... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

(తాండూర్) రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అగ్రి డ్రోన్ల ద్వారావేగవంతమైన సురక్షితమైన పికారి విధానం లభిస్తుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ  ఆధ్వర్యంలో ఎల్మకన్య పిఎసిఎస్ ద్వారా అగ్రి డ్రోన్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించి అగ్రి డ్రోన్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు ఈ సేవలు అందుబాటులోకి రావడం వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, రైతుల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమన్నారు.అనంతరం క్యాంప్ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ర్స పన్ నీరజ బాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.