schedule Thursday, May 21, 2026

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

calendar_today April 24, 2026
person Prajagalam News
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
 
  • విద్యుత్ బస్సుల ప్రైవేటుకరణ ఆపాలి*

  • 2021,2025,సం. పిఆర్సి అమలు చేయాలి

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి....జేఏసీ సిఐటియు డిమాండ్

(తాండూర్) తాండూర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు గత మూడు రోజుల నుండి తమ సమస్యలను పరిష్కారం కావాలని ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. తాండూర్ డిపో గేట్ ముందు మృతి చెందిన  శంకర్ గౌడ్ కు ఘనంగా ఆర్టీసీ కార్మికులందరూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు జేఏసీ గౌరవ చైర్మన్ సోమశేఖర్ వైస్ చైర్మన్ సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ తాండూర్ డిపో చైర్మన్ అంజలయ్య తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే చంద్రయ్య పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు గత మూడు రోజుల నుండి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల మొండిగా వ్యవహరిస్తుంది ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం వారి యొక్క డిమాండ్లను పరిష్కారం చేయడంలో విఫలం అయిందన్నారు. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. 2021, 2025 పిఆర్సి అమలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ ప్రజాసంఘాల డిమాండ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు సమ్మెను పూనుకున్నాయని ముఖ్యంగా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన 33 డిమాండ్లను పరిష్కారం చేయాలని జేఏసీ ప్రజాసంఘాలు సిఐటియు తెలంగాణ మైనార్టీ హక్కుల సమితి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయని యెడల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఎండి సాదిక్ జేఏసీ వైస్ చైర్మన్ నవీన్ గౌడ్, జేఏసీ కన్వీనర్ ఎస్ ఏ భాష వైస్ కన్వీనర్ ఎం సుదర్శన్ ఎం రమేష్ కోశాధికారి ఎండి మోదీన్ పి ఎస్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు లక్ష్మీ,ప్రియ,సుజాత, యాదమ్మ,రాణి,శోభ,లక్ష్మి అనంత రాములు విజయకుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.