schedule Thursday, September 03, 2026

ఇసుక తరలింపులో అనుమతులు లేకుంటే చర్యలు తప్పవు ఎస్.ఐ శ్రీశైలం యాదవ్

calendar_today April 23, 2026
person Prajagalam News
ఇసుక తరలింపులో అనుమతులు లేకుంటే చర్యలు తప్పవు ఎస్.ఐ శ్రీశైలం యాదవ్
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో పరిధిలో మంతట్టి గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను విధులు నిర్వహిస్తున్న పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్.ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు.ఎస్.ఐ తెలిపిన వివరాల ప్రకారం గురువారం నాడు ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయంలో మంతట్టిలో వాగు నుండి అదే గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లగా మంతట్టి గ్రామానికి చెందిన తిరుపతి ప్రవీణ్ కుమార్,తండ్రి మహిపాల్ ట్రాక్టర్ ఇంజన్ నెంబర్ టిఎస్ 34 కె 4268, ట్రాలీ నెంబర్ టిజి 34 టిఆర్ 5037 ట్రాక్టర్ ను పోలీసు ఆపి అనుమతి పత్రాల అడగగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు.