ఘనంగా విఠల్ నాయక్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు.
April 22, 2026
Prajagalam News
(తాండూర్)
తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వర్త్య విఠల్ నాయక్దం కిష్టమ్మ దంపతుల 26 వసంతాల పెళ్లిరోజు వేడుకలు ఘనంగా తన నివాసంలో నిర్వహించారు.కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెళ్లిరోజు వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ సంపత్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సిములు హాజరై విఠల్ నాయక్ దంపతులకు శాలువాతో ఘనంగా సన్మానించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన బంధువులకు మిత్రులకు రాజకీయ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దంపతులు ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకుంటూ, తమ జీవన ప్రయాణాన్ని స్మరించుకున్నారు. దంపతులు ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి. రమేష్ మరియు భాస్కర్. రవి గౌడ్. వీరారెడ్డి,కట్ట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు నరేష్. భాస్కర్ రెడ్డి. కుటుంబ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.