schedule Thursday, May 21, 2026

తాండూర్ లో వెదలెక్స్ ఆయుర్వేద  స్టోర్ ప్రారంభం    

calendar_today April 20, 2026
person Prajagalam News
తాండూర్ లో వెదలెక్స్ ఆయుర్వేద  స్టోర్ ప్రారంభం     
    ఆయుర్వేదంతో దీర్ఘకాలిక రోగాలు నయం....డాక్టర్ కీర్తన రెడ్డి ( తాండూర్) తాండూర్ పట్టణంలో ఆయుర్వేద స్టోర్ ప్రారంభం అయ్యింది . ఈ స్టోర్ ను ఢిల్లీ ఆయుర్వేద డాక్టర్ కీర్తన రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని సోమవారం పట్టణంలోని మదీనా కాంప్లెక్స్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చని అన్నారు. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం దివ్య ఔషధం అని అన్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయిన వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ను వెదలెక్స్ కంపెనీ అందిస్తుందని అన్నారు.స్టోర్ లో ఆయుర్వేద మందులతో పాటు సప్లిమెంట్స్, నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా స్టోర్ లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని నిత్యవసరాలైన సబ్బు పేస్ట్, అన్ని రకాల వస్తువులు ఈ స్టోర్ లో లభ్యమవుతాయని అన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను వాడడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని దేశీయ ఉత్పత్తులను కొని ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా ఉత్పత్తులను డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ద్వారా నిరుద్యోగులకు పార్ట్ టైం ఉద్యోగాలు కల్పించే దిశగా కంపెనీ ప్రణాళిక రూపొందించిందని అన్నారు.ప్రజలు స్టోర్ ను సందర్శించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని కొని ప్రోత్సహించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో  కంపెనీ ప్రతినిధులు  అగ్రి ట్రైనర్   సంజీవ్ కుమాార్, టీం లీడర్ అశ్విని సాయిరెడ్డి, స్టోర్ ఇంచార్జ్ సత్యనారాయణ, లీడర్స్ ఎండి నసీరుద్దీన్, పోచయ్య, రమేష్ సింగ్, రెడ్డి ఘనపూర్ సాయిలు, రజక కృష్ణ, లక్ష్మి, గోపాల్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్, అనిత ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు జాదవ్ రాము, ఎండి వసీం, సమీర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.