* 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును యధాతథంగా అమలు చేయాలి..... మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి
(తాండూర్)
మహిళా బిల్లుకు డీ లిమిటేషన్ బిల్లుతో బిజెపి ప్రభుత్వం లింకు పెట్టడం ఎందుకని 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును యథాతకంగా అమలు చేయాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు. ఓ ప్రకటనలో చైర్పర్సన్ మాట్లాడుతూ 2023 వ సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టసభలలో 33% రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వ్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి ఆమోదింప చేసిందన్నారు. ఇప్పుడు పార్లమెంటులో ఉన్న 543 సీట్లలో 33% మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన బిల్లును గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి తక్షణమే అమలు చేయాలని అన్నారు.మనువాదులు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మహిళల అధిపత్యాన్ని ఓర్వలేకనే ఈ బిల్లును డి లిమిటేషన్ బిల్లుతో లింకు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.ప్రస్తుతం పార్లమెంటులో వీగిపోయింది మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదు ఇది 2023లోనే ఆమోదింపబడ్డదని గుర్తు చేశారు.హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు భవిష్యత్తులో తమ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు నిర్ణయిస్తే తక్కువ పాపులేషన్ ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హిందీ రాష్ట్రాల బిజెపి పెట్టనాన్ని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడానికే ఈ ప్రయత్నమని అన్నారు.భవిష్యత్తులో జరిగే ఈ ప్రమాదాన్ని పసిగట్టి తిప్పి కొట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర కీలకమని అన్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిజంగా మహిళలపై ప్రేమ ఉంటే 2023లో ఆమోదించబడిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లును డి లిమిటేషన్ తో లింకు పెట్టకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తగు సవరణలు చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మొన్న పార్లమెంటులో వీగిపోయింది డీ లిమిటేషన్ బిల్లు మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లు కాదనే విషయాన్ని బిజెపి నాయకులు గమనించాలని మరియు అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని కోరారు.