మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
April 18, 2026
Prajagalam News
వికారాబాద్-:
రైతులు దళారులను నమ్మి మోసపోకుండా,రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే లాభాలు వస్తాయని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్, డి సి ఎం స్ వారి ఆధ్వర్యంలో వికారాబాద్ డిసిఎంఎస్ కార్యాలయం ప్రాంగణంలో వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో శనివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ... ప్రభుత్వం మొక్క జొన్నలకు మద్దతు ధర క్వింటలకు రూ.2,400 రూపాయలు నిర్ణయించడం జరిగిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లో మంచి ధరకు తమ పంటను రైతులు విక్రయించాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు పండించిన పంటలకు మంచి ధర కల్పించి కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాధం సత్యనారాయణ , డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బి.రాజశేఖర్ రెడ్డి , చిగుళ్లపల్లి రమేష్ ,డీసీఎంఎస్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్లు, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.