schedule Thursday, May 21, 2026

మట్టిలో మాణిక్యం మోయిజ్.... చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి

calendar_today April 18, 2026
person Prajagalam News
మట్టిలో మాణిక్యం మోయిజ్.... చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి
  *నేటి యువతకు ఆదర్శం మూయిజ్.. యువ నాయకులు వసీం (తాండూర్) మట్టిలో మాణిక్యం మోయిజ్ అని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు.నేపాల్ షూటింగ్ బాల్ టోర్నమెంట్‌లో తాండూరు ఇంద్రా నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు మోయిజ్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఇంద్రనగర్ యువ నాయకులు మొహమ్మద్  వసీం  ఆధ్వర్యంలో ఘనంగా  ఊరేగించి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఇందిరానగర్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ మహమ్మద్ తాండూర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ అయిన మహమ్మద్ రఫీక్ కుమారుడు మహమ్మద్ మోయిజ్ బంగారు పతకాన్ని సాధించడం గర్వకారణం అని అన్నారు. ప్రభుత్వపరంగా మా పరంగా ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని అన్నారు. యువకులు మూయిజ్ ను ఆదర్శంగా తీసుకొని తమకు ప్రతిభ ఉన్న రంగాలలో లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  పిలుపునిచ్చారు. అనంతరం 4వ. వార్డు కాంగ్రెస్ యువ నాయకుడు మహమ్మద్ వసీం మాట్లాడుతూ చాలామంది యువకుల ఆసక్తి చూపని క్రీడలో ఇష్టాన్ని పెంచుకొని దేశానికే పథకానికి తేవడం ముఖ్యంగా ఇంద్రనగర్ వాసులకు గర్వకారకమని అన్నారు. తాండూర్ నుంచి నేపాల్ కు అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగించి బంగారు పథకాన్ని సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ సాజిద్ అలీ, ఇందిరానగర్ కాలనీవాసులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.