schedule Thursday, May 21, 2026

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

calendar_today April 18, 2026
person Prajagalam News
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
  వికారాబాద్ :- ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టిజిఈ జేఏసీ ప్రెసిడెంట్ అనిల్ బాబు, వైస్ ప్రెసిడెంట్ టి.సరోజ డిమాండ్ చేశారు.తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో విన్నతి పత్రం అందజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ... జూన్ 2వ తేదీ నాటికి ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని తెలిపారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకటిత ఎంప్లాయిస్ హెల్త్ స్కిం తక్షణమే అమలు చేయాలని ,ఉద్యోగులందరికి హెల్త్ కార్డులు జారీ చేయాలని చెప్పారు.సీపీఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరణ చేయాలన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిపిఓలు,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.