schedule Thursday, May 21, 2026

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి తహశీల్దార్ షాహేదా బేగంకు మెమోరాండం అందజేత

calendar_today April 17, 2026
person Prajagalam News
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి తహశీల్దార్ షాహేదా బేగంకు మెమోరాండం అందజేత
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో టీజీఇజేఎసి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిని నిరసిస్తూ,317 సమస్య పరిష్కారం,పిఆర్సి వెంటనే అమలు చేయాలని,పెండింగ్ లో ఉన్న డి ఎ లు మంజూరు చేయాలని,సిపిఎస్ రద్దు, ఓపిఎస్ అమలు చేయాలని,హెల్త్ కార్డ్స్,సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరష్కారం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల సాధనకై నడుము బిగుస్తూ తహశీల్దార్ షాహేదా బేగంకు, డి.వెంకట్రాంరెడ్డి,ఆధ్వర్యంలో మెమోరాండం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రైమరీ పాఠశాల, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు,తదితరులు ఉన్నారు.