schedule Thursday, May 21, 2026

అంత్యక్రియలకు ఆర్ధిక సాయం అందజేత 

calendar_today April 17, 2026
person Prajagalam News
అంత్యక్రియలకు ఆర్ధిక సాయం అందజేత 
(తాండూర్) నియోజకవర్గ పరిధిలోని యాలాల మండలంలోని బండమదిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సిములు(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచేందారు. విషయం తెలుసుకున్న తాండూరు కు చెందిన ప్రముఖ వైధ్యులు డాక్టర్ సంపత్ కుమార్ బీవిజి ఫౌండేషన్ ద్వారా నర్సిములు భార్య దేవమ్మకు ఆర్ధిక సాయం పంపించారు. గ్రామ సర్పంచ్ బెస్త నరేష్ తాను కొంత డబ్బును కలిపి అంత్యక్రియల నిర్వహణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, గ్రామస్తులు బాయికాడి బసన్న పి.చంద్రప్ప , చెట్టుకింది అంజయ్య, సండ్రస హన్మప్ప , దత్తు లక్ష్మణ్, శ్యామప్ప, లక్ష్మయ్య, పకిరప్ప తదితరులు పాల్గొన్నారు.