schedule Friday, September 04, 2026

ఉగాది ఉత్సవంలో పాల్గొన్న బి.ఎస్.ఆర్

calendar_today March 19, 2026
person Prajagalam News
 
తాండూర్ పట్టణంలోని సాయిపూర్ దేవాలయంలో ఉగాది ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ బి ఓ ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని,చేపట్టిన ప్రతి మంచి పనిలో అందరికీ విజయం చేకూరాలని,ప్రతి పండుగ ఇదే విధంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి,గోపాలకృష్ణ బాగ్రే ,పుర ప్రముఖులు,పెద్దలు,ఆర్యసమాజ్,హిందూవాహిని ప్రతినిధులు ,ధార్మిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు.