schedule Thursday, September 03, 2026

భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

calendar_today April 14, 2026
person Prajagalam News
భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి,నివాళులు అర్పించిన శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి,ఈ సందర్భంలో శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి,యువత ఆయన అడుగుజాడల్లో నడిచి ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్,బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు శంకరప్ప,ఆర్.కృష్ణ,ఏఎంసి వైస్ చైర్మన్ చందర్ నాయక్,మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.