రైతులు చలి వేంద్రాన్ని ఉపయోగించుకోవాలి
April 14, 2026
Prajagalam News
వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య
వికారాబాద్-:
రైతులు,ప్రజలు చలి వేంద్రాలను ఉపయోగించుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు.
మంగళవారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ఏ ఎం సి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మరియు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు స్వర్గీయ గడ్డం శైలజమ్మ జ్ఞాపకార్థం చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయగా ,దానిని వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ... వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చల్లని త్రాగునీరు అందించడం శుభపరిణామం అన్నారు.వికారాబాద్ పట్టణానికి వివిధ అవసరాల మేరకు వచ్చే ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.వేసవి కాలంలో నీరు శరీరానికి ఎంతో ముఖ్యమని సూచించారు.ఈ సందర్బంగా ప్రజల అవసరాల నిమిత్తం ఎండాకాలం ప్రజలకు చల్లని నీరు అందించడం మంచి సేవ కార్యక్రమం అని వికారాబాద్ ఏ ఎం సి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ని మరియు పాలక వర్గాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అభినందించారు. వికారాబాద్ రైతు బజార్ లో, కూరగాయల మార్కెట్ (బిట్ల ) వద్ద ఈ చలి వేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఏ ఎం సి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఎం సి వైస్ చైర్మన్ మల్లేశం, సెక్రటరీ ఫాసియొద్దీన్, డైరెక్టర్ లు రాజునాయక్, పాపిరెడ్డి, నాయకులు విజయ్, నరేందర్, ఇమ్రాన్ మార్కెట్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.