బడుగు బలహీన వర్గాలకు హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్
April 14, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల) కుల్కచర్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యలయంలో సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సర్పంచ్ వార్వాల అంజిలయ్య మాట్లాడుతు కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్తైర్యం కల్పించి, వారి హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు.గ్రామ స్వరాజం కోసం గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పయనం వైపు నడిపిస్తాము అని అన్నారు..ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ విజయ్ కుమార్, కార్యదర్శి భాస్కర్ గౌడ్, వార్డు సభ్యులు నర్సిములు, గాదె లక్ష్మి, ఉత్తరకుమారి,పుట్ట రాధిక,వినోద్,పోతగాళ్ల మంజుల,రాంరెడ్డి,శివానీ జంగమ్మ ఎల్లయ్య,గ్రామ పెద్దలు కాటన్ పల్లి అంజిలయ్య,హరికృష్ణ, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్,నారాయణ, రామస్వామి, చెన్నయ్య పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.