schedule Thursday, May 21, 2026

ఘనంగా శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు

calendar_today April 12, 2026
person Prajagalam News
ఘనంగా శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు
            * వైభవంగా కొనసాగిన రథోత్సవం   * వేలాదిగా తరలివచ్చిన భక్తులు * పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి * నేడు లంక దహన కార్యక్రమం     (తాండూరు) పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రత్యేక కార్యక్రమం రథోత్సవం సందర్భంగా ప్రజలు తాండూరు మారుమూల ప్రాంతాల నుండి కాకుండా కర్ణాటక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున తరలించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. శనివారం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన 55 అడుగుల రథానికి కలశపూజ నిర్వహించారు. శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. రథోత్సవం వద్ద జరిగిన పూర్ణాహుతి హారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూలతో అలంకరించిన రథంపై పూర్ణాహుతి అనంతరం స్వామివారిని ప్రతిష్ఠించడంతో రథం ముందుకు కదిలింది. భద్రాచలం కూడా నుంచి బసవన్న కట్ట వరకు సాగిన రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రాంతం నుండి కాకుండా సమీప కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తన స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చారు. అశేష జనవాహిని మధ్య భక్తులు భ ద్రేశ్వరుడికి జై” అనే నినాదాలతో భద్రేశ్వర ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. రథోత్సవం సందర్భంగా తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.రథాన్ని లాగుతున్న సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేడు రాత్రి బ్రహ్మోత్సవాలలో రెండవ ప్రధాన ఘట్టం లంక దహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రథోత్సవ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్ పర్సన్ సుజాత , మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి , ఏఎంసి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్, బీసీ సంఘ నాయకులు శుభప్రద పటేల్, ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులు మేడి మహేష్, బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పట్టణ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, వీరశైవ సమాజ సంఘ ప్రతినిధులు, ఫెస్టివల్ కమిటీ సభ్యులు గంగా శ్రావణ్ కుమార్, గాజుల విజయ్ కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రకాంత్, మాద్రికి చంద్రకాంత్, కోర్వార్ అంజలి,అగ్గనూరు సంకేత్.ఆలయ ఈవో శేఖర్ గౌడ్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.