schedule Thursday, September 03, 2026

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన రాజపుత్ సమాజ సభ్యులు

calendar_today April 12, 2026
person Prajagalam News
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన రాజపుత్ సమాజ సభ్యులు
  ( తాండూర్) పట్టణంలోని ఇంద్రానగర్ లో జరిగిన శిలాఫలక ధ్వంసం ఘటనపై   రాజ్ పూత్ సమాజ సంఘ సభ్యులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోలీస్ శాఖకు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూర్తి ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తామని సమాజ సభ్యులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజపూర్ సమాజ సంఘ సభ్యులు,మహిళా సమాజ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.