అందరికీ ఆదర్శం మహాత్మ జ్యోతిరావు పూలే.. బీఆర్ఎస్ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి
April 11, 2026
Prajagalam News
( తాండూర్) అందరికీ ఆదర్శం మహాత్మ జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా తాండూరు బీఆర్ఎస్ నాయకులు మహనీయునికి ఘన నివాళి అర్పించారు. తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిగా నూతనంగా నియమితులైన రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి పంజుగుల మాట్లాడుతూ 'విద్య లేక వివేకం లేదు, వివేకం లేక వికాసం లేదు, వికాసం లేక పురోగతి లేదు' అన్న మహాత్మా ఫూలే సందేశం అందరికీ అనుసరణీయం అన్నారు. సావిత్రీ బాయి, జ్యోతిరావు ఫూలే దంపతుల అవిరళ కృషి వల్ల భారత దేశ బహుజనులకు విద్య అందిందని అన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర పాలకులు ఫూలే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధిపత్య శక్తుల కింద నలిగి, అన్ని రకాల హక్కులు హరింపబడ్డ అణగారిన వర్గాల కోసం ఫూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. యువత విద్యపై దృష్టి పెట్టాలని, మంచి సమాజ నిర్మాతలుగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సిములు, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ చారి, ఉమాశంకర్, నరేందర్ గౌడ్, సిద్రాల శ్రీనివాస్, పాండురంగారెడ్డి, సలీం, రమేష్, శకుంతల, చంద్రశేఖర రెడ్డి, రాములు, ఇర్ఫాన్, వీరయ్య, సంతోష్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.