schedule Thursday, May 21, 2026

ముజాహిద్ పూర్ లో పంచాంగ శ్రవణానికి విశేష స్పందన

calendar_today March 19, 2026
person Prajagalam News
ముజాహిద్ పూర్ లో పంచాంగ శ్రవణానికి విశేష స్పందన
  వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసి పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ పండితుడి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించి గ్రామస్తులకు వారి పేర్ల ఆధారంగా రాశిఫలితాలను వివరించారు. పరాభవనామ సంవత్సరంలో కలుగబోయే శుభ ఫలితాలు, వ్యవసాయ పరిస్థితులు, ఆరోగ్య పరిరక్షణ, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై సమగ్రంగా విశ్లేషణ చేశారు. ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమంలో కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్, స్థానిక సర్పంచ్ చంద్రభూపాల్, వార్డు సభ్యులు,గ్రామంలోని పెద్దలు,యువకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.