schedule Thursday, May 21, 2026

ప్రజాస్వామ్యం చట్ట విరుద్ధ  కార్యక్రమాలపై చర్యలు తీసుకోండి  .... జిల్లా కలెక్టర్ కు నివేదించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు.

calendar_today April 10, 2026
person Prajagalam News
ప్రజాస్వామ్యం చట్ట విరుద్ధ  కార్యక్రమాలపై చర్యలు తీసుకోండి   .... జిల్లా కలెక్టర్ కు నివేదించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు.
 
  (తాండూర్) తాండూర్ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలు, కౌన్సిలర్లను పక్కన పెట్టడం పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ 12 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్రజలు మాకు నమ్మకం ఉంచి గెలిపించి తమ సమస్యలను పరిష్కరించేందుకు బాధ్యత అప్పగించారని అయితే, ప్రస్తుతం తాండూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న కొన్ని చర్యలు ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని నివేదించారు. ప్రభుత్వం అందించిన "రంజాన్ తోఫా" పంపిణీ సమయంలో, మా వంటి ఎన్నికైన కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కేవలం అధికార పార్టీ నాయకుల ద్వారా మాత్రమే పంపిణీ ' చేశారని దీనిపై మా వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని అలాగే తాండూర్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ విషయంలో, అధికార పార్టీకి చెందిన ఓడిపోయిన కార్యకర్తల ద్వారా వెరిఫికేషన్ చేయించి ఇళ్లను కేటాయిస్తున్నారనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయని ఇది నిజమైతే, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జిల్లా హౌసింగ్ డిఈ కి వినతి పత్రాన్ని అందించారు.ఎన్నికైన ప్రతినిధుల గౌరవాన్ని అవమానపరిచే చర్య అని ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తుందని ప్రజలు గెలిపించిన కౌన్సిలర్లను పక్కన పెట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం కార్యక్రమాలు నిర్వహించడం రాజ్యాంగానికి మరియు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని రంజాన్ తోఫా పంపిణీపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో పారదర్శకత తీసుకురావాలని మరియు నిజ నిర్ధారణ చేయాలని మున్సిపాలిటీలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమంలో ఎన్నికైన కౌన్సిలర్లకు తగిన ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. వెంటనే స్పందించి న్యాయం చేయవలసిందిగా వినతిపత్రంలో నివేదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఇర్షాద్, జావీద్, సురేష్ నాయక్, యోగానంద్, బీఆర్ఎస్ నాయకులు రుద్రపటేల్ సంతోష్ గౌడ్, ఎజాజ్ అనంతరెడ్డి సంతోష్ లు పాల్గొన్నారు.