శ్రీనన్న చొరవతో జర్నలిస్టుల సమస్య పరిష్కారం.
April 8, 2026
Prajagalam News
(తాండూర్)
గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుల ప్లాట్ల సమస్య ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చొరవతో పరిష్కృతమైంది. మంగళవారం తాండూర్ మండలం అంతారం గ్రామ సమీపంలోని సునీత మహేందర్ రెడ్డి జర్నలిస్టు కాలనీలో ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ముందుండి సమస్యను పరిష్కరించారు. ఎండను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టులతో కలిసి అక్కడే రెండు గంటల పాటు సమయం వెచ్చించి భూమి సర్వే చేయించి హద్దులను ఏర్పాటు చేయించారు. ప్లాట్ నెంబర్ ప్రకారం జర్నలిస్టులకు అందించేందుకు సర్వం సిద్ధం చేయించారు. దీంతో అక్కడ ప్లాట్లు ఉన్నాయి జర్నలిస్టులు శ్రీనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు,పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.