ప్రభుత్వ భూమిని కాపాడండి ... బీఆర్ఎస్ కౌన్సిలర్ల వినతి
April 8, 2026
Prajagalam News
(తాండూరు)
తాండూర్ పట్టణం లో సర్వే నంబర్ 111లో ప్రభుత్వ విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల భూమి జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై
చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు ఆధ్వర్యంలో ఆర్డీవో అనిత , తహసిల్దార్ తారా సింగ్,
కమిషనర్ల మధుసూదన్వి రెడ్ది లకు వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 111లో ప్రభుత్వ విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల భూమిపై షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని ఈ నిర్మాణం పేరుతో పాఠశాల స్థలాన్ని కూడా అక్రమంగా ఆక్రమించడం జరుగిందని. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్నది
ప్రభుత్వ భూమి మరియు పాఠశాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజా ప్రయోజనాలకు, విద్యా వ్యవస్థకు మరియు చట్టాలకు విరుద్ధంగా ఉందని పిర్యాదులో నివేదించామని
ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ మరియు పాఠశాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్షాద్, జావిద్, యోగానంద్, అనిల్, నాయకులు సంతోష్ గౌడ్, రుద్రుపాటిల్, నాయకులు ఏజాజ్ తదితరులు ఉన్నారు.