schedule Thursday, May 21, 2026

కబడ్డీ టీం ఇండియా క్యాంపుకు ఎంపికైన ముడావత్ సంజు

calendar_today April 8, 2026
person Prajagalam News
కబడ్డీ టీం ఇండియా క్యాంపుకు ఎంపికైన ముడావత్ సంజు
వికారాబాద్ జిల్లా (పరిగి):-ఏప్రిల్ 1 నుండి 4వరకు మహారాష్ట్రలోని పుణే (ఆలంది)లో జరిగిన 35వ సబ్-జూనియర్ బాలబాలికల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు బాయ్స్ టీమ్ కోచ్ గా వ్యవహరించిన జారుపుల గణేష్ (ఎన్ఐఎస్ కోచ్)పర్యవేక్షణలో వికారాబాద్ జిల్లాకు చెందిన ముడావత్ సంజు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఇండియా టీం క్యాంపుకు ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా క్రీడాకారుడు సంజును వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవన్ నాయక్, సెక్రటరీ సుభాష్ నాయక్, అసోసియేషన్ సభ్యుడు కోచ్ గణేష్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో వీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.