తాండూరు నుండి నేపాల్‌కు!
April 7, 2026
Prajagalam News
మొహమ్మద్ మోయిజ్ అప్రతిహత ప్రస్థానం!
(తాండూరు ) తాండూర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ అయిన మహమ్మద్ రఫీక్ కుమారుడు మహమ్మద్ మోయిజ్ తాండూర్ నుంచి నేపాల్ కు అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.తాండూరుకు చెందిన ఈ యువ షూటర్, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, కాఠ్మండులో జరిగిన 'ఇండో-నేపాల్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ సిరీస్-2026'లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లాడు.తాండూర్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యను అభ్యసిస్తూ ఆర్థిక ఇబ్బందులను నిమిత్తం ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తన లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్నాడు. ఈ మట్టిలో మాణిక్యం బాల్ సిరీస్ లో విజయాన్ని అందుకొని తాండూర్ కు మంచి పేరు తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు.తాండూరుకు ఇది ఒక గర్వించదగ్గ క్షణం తన విజయ యాత్ర కొనసాగాలని ఆకాంక్షిద్దాం.