schedule Thursday, May 21, 2026

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ లక్ష్యం

calendar_today April 4, 2026
person Prajagalam News
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ లక్ష్యం
వికారాబాద్ (పరిగి)
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పరిగి బిజేపి పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ రెడ్డి అన్నారు. శనివారం పరిగి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ నం1 పాఠశాల ఆవరణలో
చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ తరపున అందించే ప్రోత్సహక నగదును పరిగి పట్టణ  బీజేపీ అధ్యక్షులు గుండె పల్లి బాలకృష్ణారెడ్డి   ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ మాడల్ స్కూల్ 2025 సంవత్సరంలో 10 వ తరగతి టాపర్ విద్యార్థులకు 2వేల ఐదు వందవ రూపాయల చెక్కులను అందజేశారు.
మండల స్థాయి  టాపర్ విద్యార్థులు మొత్తం 12 మందిని ఎంపిక చేయగా  పట్టణంలోని నంబర్ వన్ స్కూల్ దగ్గర  డి, మౌనిక జెడ్పిహెచ్ఎస్ నస్కల్, నేనావత్ తులసీరామ్ జడ్పీహెచ్ఎస్ నెంబర్ 2,  కుమారి సహస్ర జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ పరిగి,బుడవ దివ్య కేజీబీవీ నస్కల్ విద్యార్థులకు చెక్కులు అందజేయడం జరిగింది. మిగతా విద్యార్థులకు వారి ఇంటి దగ్గరికి వెళ్లి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పెంటయ్య గుప్తా, శ్యాంసుందర్, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు, వార్ల ఆంజనేయులు జిల్లా బిజెపి నాయకులు, ఎస్పీ శ్రీనివాస్ పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.