schedule Thursday, September 03, 2026

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది  మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్,ముజాహిద్ పూర్ సర్పంచ్ చంద్రభూపాల్

calendar_today April 3, 2026
person Prajagalam News
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది   మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్,ముజాహిద్ పూర్ సర్పంచ్ చంద్రభూపాల్
వికారాబాద్ (కుల్కచర్ల)నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్, ముజాహిద్ పూర్ సర్పంచ్ చంద్రభూపాల్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌లో లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామంలోని పేదలకు వైద్య సహాయం అందించేందుకు సిఎంఆర్‌ఎఫ్ ఎంతో సహాయంగా ఉంటుందన్నారు. లబ్ధిదారులు బోయిని లక్ష్మి అంజలయ్యకు రూ.22,000, కసాబ్ నర్సింగరావుకు రూ.21,000, బంగారి సరూప నరేష్‌కు రూ.19,500 చెక్కులను అందజేశారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే చెక్కులు అందజేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ ఉప సర్పంచ్ అరుణ భీమయ్య, వార్డు సభ్యుడు సర్దార్ కృష్ణయ్య, అంబదాస్ చెన్నయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.