ఎమ్మెల్యే నిధులతో 13 వ వార్డులో అభివృద్ధి పనులు.. చైర్పర్సన్
March 30, 2026
Prajagalam News
--అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి
తాండూర్ : ఎమ్మెల్యే నిధులతో వార్డు నెంబర్ 13 లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు. సోమవారం అభివృద్ధి పనులను చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నీరజ మాట్లాడుతూ 13వ వార్డులోని మిత్ర నగర్ లో పార్టీలకతీతంగా నిధులు వెచ్చించి అభివృద్ధి పరుస్తామని అన్నారు. రూ, 10 లక్షల తో సిసి రోడ్డు మురికి కాల్వలకు రూ. 5లక్షలు అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. వార్డ్ 13 లో గతంలో కోటి రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా..వివిధ అభివృద్ధి పనుల కోసం పదమూడవ వార్డులో కోటి యాభై లక్షల నిధులు వెచ్చించనున్నట్లు చెప్పారు. గ్రీన్ సిటీ కాలనీ, మార్కెండే య కాలనీ, మిత్ర నగర్ తదితర కాలనీ లో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దశలవారీగా పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, కోకట్ గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, డిఈ కృష్ణ, ఏఈ గౌతమ్, ఏపీ ఓ జనార్దన్, టి ఎ నీలకంఠం, ఎఫ్ ఎ రమేష్, ఎంక పల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, చంద్రా రెడ్డి, దివాకర్ రెడ్డి, కాలనీ వాసులు విజయమ్మ, లత, గోవిందా రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.