హనుమాన్ దేవాలయంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణ మహోత్సవం
March 27, 2026
Prajagalam News
తాండూర్:
పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ బావికి బద్వేశ్వర దేవస్థానం సన్నిధిలోగల హనుమాన్ దేవాలయంలో ఆలయ చైర్మన్ డి భీమ లింగం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు జరిపించారు.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ బీమలింగం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామచంద్రమూర్తి జీవితం అందరికీ ఆదర్శమని ఆయన కృపా కటాక్షలతో తాండూర్ లో స్వర్గం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.