schedule Friday, September 04, 2026

ప్రభుత్వ చీప్ విఫ్ మహేందర్ రెడ్డిని  ఆహ్వానించిన జాతర ఉత్సవ కమిటీ ప్రతినిధులు

calendar_today March 27, 2026
person Prajagalam News
తాండూర్: ఏప్రిల్ 11న నిర్వహించే శ్రీ బావిగి బద్వేశ్వర జాతర ఉత్సవాలకు ప్రభుత్వ చీప్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి ని జాతర ఉత్సవ కమిటీ ప్రతినిధులు వీరసేవ సమాజ పెద్దలు మర్యాదపూర్వకంగా జాతర ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.తాండూర్ లో కొలుదిరిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు.తాండూర్ప లో పర్యటించిన మహేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్న ఫెస్టివల్ కమిటీ సభ్యులు మేడి మహేష్, గంగా శ్రవణ్ కుమార్, గాజుల విజయ్ కుమార్, శెట్టి చంద్రకాంత్, మధురిక చంద్రకాంత్, అగ్గనూరు సంకేత తదితరులు భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 7వ తేదీ నుండి ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. ఇందులో భాగంగా రథోత్సవం ఏప్రిల్ 11వ తేదీ రాత్రి 11 గంటలకు రథోత్సవం కార్యక్రమాన్ని  నిర్వహిస్తామని, 12న రాత్రి 10 గంటలకు లంకాదాహనం ఉంటుందని వివరించారు. స్పందించిన మహేందర్ రెడ్డి తప్పక వస్తానని పేర్కొంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని,జాతర ఉత్సవాలకు భక్తులకు అవసరమైన సదుపాయాల కోసం కూడా అధికారులను ఆదేశిస్తానని చెప్పారు.